బతుకమ్మ, దసరా సెలవులు రావడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. వందలాదిగా తరలివచ్చిన ప్రయాణికులతో కరీంనగర్ బస్టాండ్లో రద్దీ నెలకొంది.
బస్సుల్లో సీట్ల కోసం పరుగులు తీయడం కనిపించింది. జగిత్యాల బస్టాండ్ నుంచి దావన్పల్లికి వెళ్లే బస్సులో 110 మంది ప్రయాణికులు ఎక్కారు. దీంతో ప్రయాణికుల తోపులాటలో ఇద్దరు యువతులు సృహతప్పి పడిపోయారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ జగిత్యాల