కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వీకెండ్ మస్తీ సిటీ జనాల్లో జోష్ నింపింది. ఆదివారం నిర్వహించిన మ్యాజిక్ షో ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరై కల్చరల్ ప్రోగ్రామ్స్ తిలకించారు.
ఫుడ్ స్టాల్స్‌లో ఫుడ్ ఐటెమ్స్ ను టేస్ట్ చేశారు. వేలాదిగా జనం తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. కార్యక్రమంలో సీపీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.