- తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు
కరీంనగర్, వెలుగు : గత బీఆర్ఎస్సర్కార్ హయాంలో ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ పై కేసీఆర్ పేరు వచ్చేలా ఏర్పాటు చేసిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. గెస్ట్ హౌస్ పేరు మార్చాలని ఇటీవల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ బోర్డును తీసేయడం చర్చనీయాంశంగా మారింది.
విషయం తెలుసుకున్న మేయర్ సునీల్ రావు ఈ చర్యను ఖండించారు. పేరు మార్చాలని డిమాండ్ చేసిన వ్యక్తులే తొలగించారా ? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు చేశారా అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.