మానేర్ రివర్ ఫ్రంట్‌పై బుద్ధుడి విగ్రహం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: భవిష్యత్ తరాలకు అనుగుణంగా కరీంనగర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్​ఆర్వీ కర్ణన్​ అధ్యక్షతన నిర్వహించిన మీటింగ్‌కు మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న మానేర్​ రివర్​ ఫ్రంట్‌పై బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

దళితులు గౌరవంగా జీవించేందుకు సీఎం కేసీఆర్​ aదళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీ సుబ్బారాయుడు, పి.నతానియేల్,ఆర్డీవో ఆనంద్ కుమార్, మేడి మహేశ్‌, పాల్గొన్నారు.  అనంతరం 18వ డివిజన్ లో రూ.1.9కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులను  మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.  కార్పొరేటర్లు రాజేందర్ రావు, రాజశేఖర్, మాధవి, సాగర్, భూమాగౌడ్, మహేశ్‌, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్ పాల్గొన్నారు.