ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముగింపు సభను సక్సెస్ ​చేయండి

గోదావరిఖని, వెలుగు : కరీంనగర్​లో ఎంపీ బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్​చేయాలని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖని శివాజీ నగర్‌‌‌‌‌‌‌‌లోని ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం నుంచి రెండు వేల మంది లీడర్లు, కార్యకర్తలు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో లీడర్లు బల్మూరి అమరేందర్‌‌‌‌‌‌‌‌రావు, సోమారపు అరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, లావణ్య, దుబాసి మల్లేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

కొత్తపల్లి, వెలుగు : పట్టణానికి చెందిన దివ్యాంగ చిన్నారులకు పింఛన్ ఇస్తామని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. పట్టణానికి చెందిన ఎండీ.గౌస్ హసీనా తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్​ను కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కలిశారు. తన పిల్లల పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సదరం సర్టిఫికెట్ఇప్పించి, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వీల్​చైర్ 
అందజేశారు.

కాంగ్రెస్ లీడర్లపై దాడి దారుణం:సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్, వెలుగు : కాంగ్రెస్ వ్యూహకర్త  సునీల్ కనుగోలు ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బుధవారం లీడర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దాడిని ప్రజస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారని తెలిపారు. తక్షణమే డీజీపీ కాంగ్రెస్ పార్టీకి క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనల పై ఎలాంటి కేసులు చెల్లవని సుప్రీకోర్టు తెలిపిందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో చొప్పదండి నియెజకవర్గ ఇన్​చార్జి మేడిపల్లి సత్యం, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, యాదవ సంఘం మహాసభల ప్రెసిడెంట్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.    


బీఆర్​ఎస్​ గూటికి గుండ్ల మంజుల
సిరిసిల్లలో మొదలైన ‘సెస్’ ఎన్నికల వేడి

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సెస్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయ వేడి మొదలైంది. సెస్​ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీ చేద్దామని అనుకుంటున్న సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గుడ్ల మంజులను టీఆర్ఎస్ లీడర్లు బుజ్జగించారు. బీఆర్ఎస్ లో  తనకు ప్రాముఖ్యం కల్పించకపోవడంతో మంజుల  ఇంతకాలం తటస్థంగా ఉన్నారు. సెస్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల టౌన్ 2 నుంచి డైరెక్టర్ గా నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టౌన్ 2 లో మంజుల మామ, మాజీ కౌన్సిలర్ గుండ్ల శంకరయ్యకు మంచి పట్టుంది. కాగా టౌన్ 2 నుంచి టీఆర్ఎస్ తరపున దిడ్డి రమాదేవికి సెస్ టికెట్ కేటాయించారు. దీంతో రమాదేవిని గెలిపించడం కోసం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, గుడూరి ప్రవీణ్, చీటి నర్సింగ రావు బుధవారం మంజుల ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తన మద్దతు దిడ్డి రమాదేవికి ఇస్తానని మంజుల తెలిపారు. త్వరలోనే కేటీఆర్ ను కలుస్తానని, సెస్ ఎన్నికల్లో సిరిసిల్ల టౌన్ 1, టౌన్ 2 అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. 

‘దరఖాస్తుల డిజిటలైజేషన్ ను పూర్తి చేయాలి’

కరీంనగర్ టౌన్, వెలుగు: ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ ను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్షరెన్స్ లో మాట్లాడారు. నూతన ఓటరు నమోదు,  జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 26లోపు పరిశీలించి పూర్తి చేయాలన్నారు. కాన్ఫరెన్స్​ లో కలెక్టర్​కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ సభకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ గ్రౌండ్ లో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. నవంబర్ 29న భైంసా నుంచి ప్రారంభమైన యాత్ర డిసెంబర్15న కరీంనగర్ సిటీకి చేరనుంది. సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభ సందర్భంగా కరీంనగర్ పట్టణం మొత్తం కాషాయమయమైంది. సీనియర్ బీజేపీ లీడర్​మర్రి శశిధర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కరీంనగర్ లో ఉండి సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. నగరవ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేసి సభను సక్సెస్​చేయాలని ప్రజలను కోరారు.

ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి:వెంకట్ రెడ్డి

వేములవాడ, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం వేములవాడలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం బడుగు బలహీనవర్గాలకు చేసిందేమీ లేదని, ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని, అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలన్నారు. ఇల్లు కట్టడానికి రూ.3 లక్షలు సరిపోవని, సిమెంట్, స్టీల్, మెటీరియల్ ధరలు పెరిగినందున ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్​21న తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామన్నారు. సమావేశంలో సీపీఐ కార్యదర్శి గుంటి వేణు, కడారి రాములు పాల్గొన్నారు.

మార్కెట్లు త్వరగా నిర్మించాలి: అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్

కొత్తపల్లి, వెలుగు : పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​వెజ్ మార్కెట్లను త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, మన ఊరు- మన బడి, నర్సరీలను ఆమె పరిశీలించారు. అనంతరం వివిధ టాక్స్ ల వసూళ్లపై అధికారులు, పాలకవర్గ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది 32 వేల మొక్కలను నాటాల్సి ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆస్తి పన్ను, వాణిజ్య, ఇతర లైసెన్స్​లకు సంబంధించిన పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్​ కమిషనర్ వేణుమాధవ్, మెప్మా పీడీ రవీందర్, డీఎంసీ శ్రీవాణి, మున్సిపల్ ఏఈ సయ్యద్ ఆసిఫ్, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ ప్రైవేట్ ఆర్మీగా పోలీసులు

జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందీరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదాపూర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీస్ పై ఎలాంటి అనుమతి, కనీసం సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొడుకైనా.. కూతురైన అవినీతి ఆరోపణలు వస్తే సలాకల ఎనుక నిలబెడుతా అని నాడు కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఈడీ, సీబీఐ విచారణకు రాగానే కవిత ప్రగతి భవన్ కు పరుగుపెడుతోందని ఎద్దేవా చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యులు నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.