మహిళల సమస్యల పరిష్కారానికే శుక్రవారం సభ : ​ కలెక్టర్ పమేలా సత్పతి

మహిళల సమస్యల పరిష్కారానికే శుక్రవారం సభ : ​ కలెక్టర్ పమేలా సత్పతి

రామడుగు, వెలుగు: మహిళల వివిధ సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదిక అని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రతి గ్రామంలోని మహిళలు తమ సమస్యలను ఈ సభలో విన్నవించుకోవాలని కోరారు. రామడుగు మండలం కొక్కెరకుంటలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చన్నారు.

 అనంతరం అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారికి అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో డీఎస్​డబ్ల్యూవో సబిత, డీఎంహెచ్​వో వెంకటరమణ, మండల ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్‌‌, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో అనిల్, సీడీపీవో నర్సింగరాణి, మెడికల్‌‌ ఆఫీసర్ అరుణ, అంగన్​వాడీ సూపర్​వైజర్ సుధారాణి పాల్గొన్నారు.