ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్​కు పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి 

ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్​కు పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 20 నుంచి నిర్వహించనున్న టెన్త్‌‌‌‌‌‌‌‌, ఇంటర్మీడియట్  ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్  పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌పై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 4  సెంటర్లలో 881 మంది ఇంటర్, 3 సెంటర్లలో  421 మంది  టెన్త్  ఎగ్జామ్స్ రాస్తున్నట్లు వివరించారు. ప్రశ్నాపత్రాల, ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్ల తరలింపులో పోలసులు పకడ్బందీగావ్యవహరించాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌లో 246 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

శానిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్మికులు గురుకొండ  రాజబాబు, తిరుపతి ఇటీవల చనిపోగా వారి కుటుంబాలకు పీఎంజేజేబీవై ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కులను ఇచ్చారు. జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా ప్రీమియం చెల్లించిన మున్సిపల్ కమిషనర్ ఆయూబ్ ను అభినందించారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని యూనియన్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డితో  కలిసి కలెక్టర్  ప్రారంభించారు.  ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌, ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్, సంగం లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌రావు, కిరణ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాళిచరణ్​, సుమంత్ రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీటీడీవో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, డీఈవో  జనార్ధన్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.