కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఇన్ స్టాగ్రమ్ లో భావోధ్వేగ పోస్ట్ పెట్టారు. కలెక్టర్ గా ఎదిగే క్రమంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదురుకున్నాను. మహిళగా ఎన్నో రకాల వివక్ష, అణిచివేత, ఇబ్బందులను తట్టుకున్నాను. పలు సార్లు యుద్ధం చేస్తాను...కానీ పలు సార్లు ఓడిపోతాను అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తర్వాత కాసేపటికి ఇన్ స్టా నుంచే తొలగించడం గమనార్హం.
ALSO READ : ఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్
జనవరి 24న కరీంనగర్ లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చారు. ఈ సందర్భంగా పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై పొంగులేటి మండిపడ్డారు. కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ..వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, అసలు కామన్ సెన్స్ ఉందా? ఎస్పీ ఎక్కడా అంటూ కలెక్టర్ పమేలా సత్పతి ముఖం చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో కలెక్టర్ ఇవాళ ఇన్ స్టాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.