సహకార బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి : పమేలా సత్పతి

  • కలెక్టర్ పమేలా సత్పతి

గంగాధర, వెలుగు: సహకార బ్యాంకులు అందించే సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌‌ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లో ఏర్పాటుచేసిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్​ శాఖను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందించే సహకార బ్యాంకుతో గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

కరీంనగర్ జిల్లాలో రెండో బ్రాంచ్​ గంగాధరలో ఏర్పాటుచేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీసీవో రామానుజాచార్య, కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్​ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్​రెడ్డి, కార్యవర్గ సభ్యులు మోహన్, భాస్కర్, ఆంజనేయులు, సందీప్, లక్ష్మి-, లక్ష్మణ్, రాజు, సంయుద్దీన్, రవీందర్ పాల్గొన్నారు.