కొత్తపల్లి, వెలుగు: ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి బస్తీదవాఖానను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ, రికార్డులు పరిశీలించి పలు వివరాలను డీఎంహెచ్‌వో సుజాతను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, రోగనిర్ధారణ పరీక్షలను మహిళలకు వివరించాలన్నారు. ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించేలా బస్తీ దవాఖానాలో టీవీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట బస్తీ దవాఖాన వైద్యాధికారి మౌల్య, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు.