కరీంనగర్ టౌన్, హుజూరాబాద్, వెలుగు: నామినేషన్ దాఖలు టైంలో ఆర్వోలు ప్రతీ డాక్యుమెంట్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని, రూల్స్పాటించాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్ ఆర్వో ఆఫీసుల్లో నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను ఉచితంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో అభిషేక్ మొహంతి, మానకొండూర్, కరీంనగర్, హుజూరాబాద్, రిటర్నింగ్ అధికారులు లక్ష్మీకిరణ్, కె.మహేశ్వర్, ఎస్.రాజు,తదితరులు పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ అనురాగ్‌జయంతి కోరారు. శుక్రవారం ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో 7 చెక్ పోస్ట్, 5 డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్‌వెంట అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, డీపీఆర్వో దశరథం పాల్గొన్నారు.
మంథని, వెలుగు: నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం మంథని రెవెన్యూ డివిజన్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు.
జగిత్యాల టౌన్, వెలుగు: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని జగిత్యాల కలెక్టర్యాస్మిన్ భాష కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మీడియాతో కలెక్టర్మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సి విజిల్ యాప్ ద్వారా 140 వరకు ఫిర్యాదులు అందాయన్నారు. ఇప్పటివరకు 15 వేల మంది సి విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు నియోజకర్గాల్లో 785 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో మొదటిరోజు 11 నామినేషన్లు
కరీంనగర్‌టౌన్, హుజూరాబాద్, జగిత్యాల టౌన్, గోదావరిఖని, వెలుగు: ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కరీంనగర్‌లో మూడు, హుజూరాబాద్నియోజకవర్గంలో ఒక నామినేషన్దాఖలయ్యాయి. కరీంనగర్‌లో ఓ ఓ ఆటో డ్రైవర్, ఓ నిరుద్యోగి, ఫొటోగ్రాఫర్ నామినేషన్ వేశారు. మానకొండూర్, చొప్పదండిలో ఈ రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్ల పరిధిలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
జగిత్యాలలో పిరమిడ్ పార్టీ నుంచి డా. సత్యనారాయణ మూర్తి, ధర్మపురిలో ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి దూడ మహిపాల్, కోరుట్లలో ముత్యం రఘు 2 సెట్ల నామినేషన్దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో మూడు నామినేషన్లు దాఖలు కాగా పెద్దపల్లి సెగ్మెంట్ నుంచి కారపూరి నరేష్ కుమార్, రామగుండంలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తమ్మెర మన్మోహన్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పెరుమాండ్ల వేదభూషణ్ నామినేషన్ వేశారు.