గంగాధర, వెలుగు: మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదిక అని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల తమ సమస్యలను శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
శుక్రవారం సభ ఆధ్వర్యంలో మహిళలకు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో సబిత, మండల స్పెషలాఫీసర్ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, తహసీల్దార్ అనుపమ, సీడీపీవో కస్తూరి, ఏసీడీపీవో నర్సింగరాణి, ఎంపీవో జనార్ధన్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్వేత, ఏపీఎం పవన్ తదితరులు పాల్గొన్నారు.
శిశువు దత్తత
కరీంనగర్ సిటీ, వెలుగు: పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపులో ఆఫీసులో శిశు గృహలో పెరుగుతున్న నాలుగు నెలల మగ శిశువును వరంగల్‌కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు.