కరీంనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, పార్టీ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు, గ్రామ స్థాయి లీడర్లకు వరకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రకటించారు.
కరీంనగర్ ప్రెస్ భవన్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడుతూ 20 రోజులుగా సొంతింటి పనులు కూడా మానుకుని తన కోసం కష్టపడినందుకు మీకందరికీ రుణపడి ఉంటానన్నారు. ఎంపీగా గెలిచి అందరి మధ్యలోనే ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు.