గోవాలో ఎంజాయ్ చేస్తున్న కరీంనగర్ కార్పొరేటర్లు

ఒకవైపు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గోవా టూర్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను కాదని వారంతా టూర్ లో ఎంజాయ్ చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గోవాకు వెళ్లినట్లు సమాచారం. వీరంతా గత రెండ్రోజలు క్రితం అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ టూర్ కు సంబంధించిన ఓ వీడియో బయటికి రావడంతో ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తమ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుందని కార్పొరేటర్ ఎడ్ల అశోక్ చెప్పారు. తామంతా నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నామని అన్నారు. దాదాపు 20మంది వరకు అక్కడ ఉన్నట్టు ఆయన వీడియోలో చెప్పారు.