గోవాలో కరీంనగర్ కార్పొరేటర్లు!

  • మేయర్​ సునీల్​ రావు కూడా..
  • సోషల్​మీడియాలో ఫొటోలు వైరల్​ 

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్​కు చెందిన రూలింగ్​పార్టీ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు బుధవారం విమానంలో గోవా ట్రిప్ కు వెళ్లారు. గురువారం మేయర్​ సునీల్​ రావు కూడా గోవాలో వీరికి జత కలిసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఎంజాయ్​ చేస్తున్న ఫొటోలను కొంతమంది సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో విషయం బయటపడింది.

గతంలో లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ టైంలో కార్పొరేటర్లు బస్సుల్లో క్యాంపులకు వెళ్లారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేకున్నా వీరంతా కలిసి విమానంలో వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముందస్తు ఎన్నికల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కార్పొరేటర్లను మచ్చిక చేసుకునేందుకే లోకల్​మంత్రి ఈ టూర్ ​ఆలోచన​ చేసినట్లు చర్చ జరుగుతోంది.