చిగురుమామిడి, వెలుగు: ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి హెచ్చరించారు. సోమవారం చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌ను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు.
స్టేషన్పరిధిలోని నేరస్తులు, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు చేపట్టి ఓటర్లకు భద్రతా భావాన్ని కలిగించాలని సూచించారు. పాత ఎన్నికల నేరస్తులు, రౌడీ షీటర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని సమావేశాలు, విందులు, డబ్బు, మందు పంపిణీపై నిఘా పెట్టాలన్నారు.