కరీంనగర్ జిల్లాలో కబ్జాదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం : సీపీ అభిషేక్ మహంతి

కరీంనగర్ జిల్లాలో కబ్జాదారులు, ఆర్థిక నేరగాళ్లపై  ఉక్కుపాదం : సీపీ అభిషేక్ మహంతి
  • అధికారాన్ని అడ్డుపెట్టుకుని దందాలు చేసినవారిని కటకటాల్లోకి..
  • పదుల సంఖ్యలో కబ్జాదారులు, చిట్ ఫండ్ చీటర్ల అరెస్టు
  • 16 నెలల్లో సీపీ అభిషేక్ మహంతి మార్క్ పోలీసింగ్ 

కరీంనగర్, వెలుగు: సీపీగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూకబ్జాదారులు, ఆర్థిక నేరగాళ్లకు వణుకు పుట్టించిన సీపీ అభిషేక్ మహంతి ఏపీకి అలాట్ కావడంతో కమిషనరేట్ ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కేసులు విచారణ దశలో ఉండి న్యాయం కోసం ఎదురుచూస్తున్న భూబాధితులు, చిట్ ఫండ్ కంపెనీల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 16 నెలల కాలంలోనే సంచలనాలకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సీపీ అభిషేక్ మహంతి మరికొన్నాళ్లు ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. తన పోస్టింగ్ కాలంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. 

* అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ 1గా పనిచేస్తున్న అభిషేక్ మహంతికి 2023 అక్టోబర్ 30న కరీంనగర్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చిన రెండు నెలలకే జిల్లాలో భూకబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ఎకనమిక్ అఫెన్స్ వింగ్(ఈవోడబ్ల్యూ) పేరిట కమిషనరేట్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి భూకబ్జాదారులు, లీడర్లు, చిట్ ఫండ్ నిర్వాహకులకు సంబంధించిన ఆర్థిక నేరాలు, భూకబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించారు. దీంతో చాలా ఏళ్లుగా తమ సమస్య పరిష్కారం కాక, పోలీసులు పట్టించుకోక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఈవోడబ్ల్యూకు క్యూకట్టారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ చివరి నాటికి 3,121 ఫిర్యాదులు అందాయి. 

వీటిలో భూకబ్జాలు, చిట్ ఫండ్ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దూకుడుగా వ్యవహరించి పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను, కార్పొరేటర్ల భర్తలను, కొందరు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు ఆఫీసర్లను అరెస్టు చేశారు. భూకబ్జాలతో సంబంధం ఉన్న ఇద్దరు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ లీడర్ల అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అంతేగాక చిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫండ్ మోసాల కేసులో అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.14.2 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయించడంలో సీపీ మహంతి కీలకపాత్ర పోషించారు. చిట్ ఫండ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. 

పోస్టింగుల్లో నో పైరవీ.. 

సాధారణంగా సీఐలు, ఎస్సైల పోస్టింగులన్నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర లీడర్ల సిఫార్సులే ఎక్కువగా జరుగుతాయన్నది బహిరంగ రహస్యం. కానీ సీపీ మహంతి బాధ్యతలు చేపట్టాక పొలిటికల్ పైరవీలకు చెక్ పెట్టారు. సిఫార్సు లేఖలతో పోస్టింగ్ తెచ్చుకున్న కొందరు సీఐలను డ్యూటీలో చేరకుండా వెనక్కి పంపారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇది జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, లీడర్లకు ఇబ్బందికరంగా మారింది. సీఐల పోస్టింగ్ విషయంలో భంగపాటుకు గురైన కరీంనగర్ సిటీ పక్కనే ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సీపీపై బహిరంగంగానే విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.