కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీని కలిసిన ఉన్నతాధికారులు 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీని కలిసిన ఉన్నతాధికారులు 

కరీంనగర్ క్రైం,వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ గౌస్ ఆలంను మంగళవారం పలువురు ఉన్నతాధికారులు వేర్వేరుగా కలిశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ జి.విజయ డేని, జైలర్ రమేశ్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో కె.వెంకటరమణ , డిప్యూటీ  డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సాహిదా, డాక్టర్ సనా.. తదితరులు సీపీని కలిశారు. 

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మంగళవారం రాత్రి సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది, వారికి కేటాయించిన విధులు గురించి అడిగి తెలుసుకున్నారు.

రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేపట్టారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు.