కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం కరీంనగర్ ప్రెస్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కానిస్టేబుల్ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా తనకు గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండుసార్లు సర్పంచ్, సింగిల్ విండో డైరెక్టర్, జడ్పీటీసీగా అవకాశమిచ్చిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఉద్యమ ద్రోహులకే ప్రాధాన్యముందన్నారు. తనతోపాటు పార్టీ మండల అధ్యక్షుడు గునుకుల రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.