‘దళితబంధు’తో సినిమా తీసిండు

జమ్మికుంట, వెలుగు: దళితబంధు పైసలతో కెమెరా, ఇతర సామగ్రికొన్న ఓ లబ్ధిదారుడు వాటితో సినిమా తీశాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన జీవీఎస్ గౌతమ్​ కృష్ణ సిటీ డైరెక్టర్. హుజూరాబాద్​ఉప ఎన్నికల టైంలో దళితబంధు కింద రూ.10 లక్షలు పొందాడు. వాటితో కెమెరా, ఇతర ఎక్విప్​మెంట్​ కొన్నాడు. 

నిర్మాత నిమ్మల సతీశ్ తో కలిసి అమ్మ ప్రొడక్షన్​స్టార్ట్​చేసి ‘ది కాప్’ అనే సినిమా తీశాడు. గౌతమ్​దళితబంధు పొందినప్పుడు కరీంనగర్​కలెక్టర్ గా ఉన్న ఆర్.వి.కర్ణన్​ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నారు. దీంతో ఆదివారం నల్గొండలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ‘ది కాప్’ సినిమా ఫస్ట్​లుక్​లాంచ్​ఈవెంట్​ఏర్పాటు చేశాడు. కలెక్టర్​ఆర్.వి.కర్ణన్​తోపాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని పోస్టర్​లాంచ్​చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితబంధుతో సినిమా తీయడం అభినందనీయన్నారు.