పాడి కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్కు రాజీనామా: ఎంపీపీ మమత

తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజుకు ఒక బీఆర్ఎస్ లీడర్ ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఇతర పార్టీలో జాయిన్ అవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జమ్మకుంట ఎంపీపీ దొడ్డె మమత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 

హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి నిరంకుశ విధానలు, ఆయన ఒంటెద్దు పోకడల వల్లే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఎంపీపీ మమత తెలిపారు. ఈరోజు(నవంబర్ 05) తన అనుచరులతో కలసి సింగాపూర్ లో వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీపీ మమతకు ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.