ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వైభవంగా దసరా వేడుకలు

ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో బుధవారం దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కరీంనగర్​అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు పాల్గొన్నారు. పలుచోట్ల అమ్మవారికి గుమ్మడి కాయలు సమర్పించారు. అనంతరం ఒకరికొకరు అలయ్​ బలయ్​ తీసుకుని జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రావణ దహనం నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.    - వెలుగు, నెట్​వర్క్​

టీఆర్ఎస్ రద్దుతో  శని వదిలింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి


జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ దసరా రోజు టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయడంతో తెలంగాణకు పట్టిన శని వదిలిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలోని ఇందీరాభవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో అన్ని రంగాల్లో విఫలమై బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారని, నాడు ఎన్టీఆర్ లాగే నేడు కేసీఆర్ రాజకీయాల్లో కనుమరుగవడం ఖాయమన్నారు. సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపేసి నీటి పంపకాల్లో మన వాటాను తీసుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని విమర్శించారు. సమావేశంలో పీసీసీ సభ్యులు నాగ భూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, దేవెందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య తదితరులు  పాల్గొన్నారు.

కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించండి
మంత్రి గంగులను కలిసిన సిక్కు ప్రబంధ్​ కమిటీ

కరీంనగర్ టౌన్, వెలుగు: సిక్కు మైనారిటీ వర్గం నుంచి సుర్జీత్ సింగ్ చాహల్ కు కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని మినిస్టర్​గంగుల కమలాకర్ ను సిక్కు ప్రబంధ్​కమిటీ సభ్యులు కోరారు. గురువారం స్థానిక మంత్రి మీసేవ ఆఫీస్ లో కమిటీ సభ్యులు మంత్రిని ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నగర పాలక సంస్థల్లో కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మైనారిటీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సర్దుల్ సింగ్, బిషన్ సింగ్, సుర్జీత్ సింగ్, జశ్వంత్ సింగ్, తన్వీర్ సింగ్, సంజీత్ సింగ్ పాల్గొన్నారు. 

సర్పంచ్​ కుమారులపై చర్యలు తీసుకోండి
కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

జగిత్యాల, వెలుగు: తమ గ్రామ టీఆర్ఎస్ ​సర్పంచ్ ​కుమారులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామస్తులు గురువారం కలెక్టరేట్​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనులపై ప్రశ్నించినందుకు సర్పంచ్​అంజయ్య కుమారులు మహాతేజ, వంశీకృష్ణ గుండాగిరి చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే సర్పంచ్ ను పదవి నుంచి తొలగించి వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్​ఇన్​చార్జి ఆఫీసర్​కు వినతిపత్రం సమర్పించారు.
మెట్ పల్లిలో బతుకమ్మ సంబురాలు

మెట్ పల్లి, వెలుగు : పట్టణంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ అనంతరం బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. మహిళల  బతుకమ్మ పాటలు, కోలాటాలతో పట్టణం సందడిగా మారింది. అనంతరం వాట్టివాగు, పెద్ద చెరువు వద్ద బల్దియా అధ్వర్యంలో  బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క, చైర్ పర్సన్ సుజాత బతుకమ్మలతో సందడి చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు,  కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 


అవినీతి సొమ్ము అరగకే బీఆర్ఎస్ 

సుల్తానాబాద్, వెలుగు: కమిషన్ల పేరిట దోచుకొని తిన్న సొమ్ము అరగకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ జి.వెంకటస్వామి(కాకా) 93వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకా విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. మిషన్ భగీరథ, కాలేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో కేసీఆర్​ కమిషన్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారన్నారు. గతంలో ‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో 7 సీట్లు కోల్పోయిన మాదిరిగా జాతీయ పార్టీ ఏర్పాటు కూడా ఫెయిల్యూర్ కావడం తధ్యమని వివేక్​ అన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి సేవలు మరువలేనివని రాష్ట్ర మాదిగ హక్కుల సంఘం అధ్యక్షుడు ఆరెపల్లి జితేందర్ అన్నారు. వెంకట్ స్వామి 93 వ జయంతి వేడుకలను బుధవారం సుల్తానాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు సజ్జత్, ఆరేపల్లి రాహుల్, ఎల్లంకి రాజన్న, కూకట్ల నాగరాజు, ఏగోలపు సదయ్య గౌడ్, ఆ రెపల్లి రాకేశ్, పల్లె తిరుపతి, కిషోర్, రవి పాల్గొన్నారు. 

కాకా ఆశయాలను కొనసాగిద్దాం

పెద్దపల్లి: మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగించాలని పెద్దపల్లి బీజేపీ సీనియర్ లీడర్​ గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి పిలుపునిచ్చారు. కాకా 93 జయంతి వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సురేష్​రెడ్డి, ఉనుగొండ శ్రీధర్​పటేల్​ కాకా చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూమయ్య, మొలుగూరి రాజవీరు, మోర మనోహర్, కల్వల శ్రీనివాస్, బండి రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగుల సంతోష్, ఉప్పు కిరణ్, సోడబాబు, మోసంపల్లి శ్రీధర్, పడాల శ్రీధర్, విజయ్, జక్కులశ్రీకాంత్, సంతోష్ పాల్గొన్నారు. 

గోదావరిఖని: కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి 93వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌశిక హరి, కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుబాసి లలిత మల్లేశ్, నియోజక వర్గ ఇన్​చార్జి మారం వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోదావరిఖని జీఎం ఆఫీస్ సమీపంలో గల కాకా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా సెల్ కన్వీనర్ కామ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బందారపు మల్లికార్జున్ గౌడ్, సాదుల రాంబాబు, మల్లేశ్​యాదవ్, కోమళ్ల మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  నర్సింగ్ దొర, సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిప్పారపు మధు, నిమ్మరాజుల రవి, ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘన నివాళి..

వెంకటస్వామి జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని కాకా విగ్రహానికి మాజీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు గొట్టెముక్కల సురేశ్​రెడ్డి తదితరులున్నారు. 


త్రీడీ లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కచ్చితమైన సర్వే
సింగరేణి జీఎం నారాయణ

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో త్రీడీ లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నాలుగు కిలోమీటర్ల మేర కచ్చితమైన సర్వే చేయడానికి వీలు ఏర్పడిందని ఆర్జీ 1 ఏరియా జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్ నారాయణ తెలిపారు. బుధవారం గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవరణలో సర్వే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రీడీ లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి ఆస్ట్రేలియా నుంచి రూ.2.50 కోట్ల చొప్పున ఆరు త్రీడీ లేజర్​ స్కానర్లను కొని సింగరేణిలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆఫీసర్లు రాఘవేంద్రరావు, నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.