ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

టెక్నాలజీకి అనుగుణంగా పని చేయాలి
ఎస్పీ సింధుశర్మ 


జగిత్యాల, వెలుగు: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జగిత్యాల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్​లో పోలీస్ శాఖ నూతనంగా ఆవిష్కరించిన సీసీటీఎన్ఎస్ నూతన వెర్షన్ 2.0 కు సంబంధించి ఎస్పీ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ నూతన వెర్షన్ 2.0తో అధికారులు, సిబ్బంది పని భారం లేకుండా ఉత్సాహంగా విధులు నిర్వహించుకోవచ్చన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులకు, స్టేషన్ రైటర్లకు, టెక్ టీం రైటర్లకు, విడతలవారిగా శిక్షణ ఇస్తామని అన్నారు. వెర్షన్ 2.0 వర్క్ కు సంబంధించి రైటర్లకు సంబంధిత ఎస్సైలు పర్సనల్​గా గైడ్ చేయాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్ సిబ్బందికి 2.0 పనితీరును వివరించారు. సమావేశంలో డీఎస్పీలు ప్రకాశ్, రవీంద్ర రెడ్డి, ఎస్బీ ఇన్​స్పెక్టర్​శ్రీనివాస్, సీఐలు రమణ మూర్తి, శ్రీను, కోటేశ్వర్, కృష్ణకుమార్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

వరకట్నం వేధింపుల కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

జగిత్యాల, వెలుగు: వరకట్న హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలుతోపాటు రూ.1500 జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణవాడ కు చెందిన పుల్ల గంగవ్వ కూతురు జ్యోతిలక్ష్మికి గడ్డం తిరుపతి తో సుమారు 2012 లో వివాహం జరిగింది అప్పటి నుంచి తిరుపతి అదనపు కట్నం కోసం జ్యోతిలక్ష్మిని వేధింపులకు గురి చేయగా, పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిపించారు. అయినా వేధిపులు ఆపకపోవడంతో జ్యోతిలక్ష్మి 2017 మే 29న ఇంట్లోని బాత్ రూంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 జూన్ 20న మృతి చెందింది. మృతురాలి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసు విచారణ చేసిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

‘పోడు’ అర్జీలపై విచారణ పూర్తి చేయాలి 
జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి

రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో పోడు భూముల కోసం  వచ్చిన అర్జీలపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఫారెస్ట్, వ్యవసాయ అధికారులకు పోడు భూముల అర్జీల విచారణపై ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు టీమ్ లు ఏర్పాటు చేశామని,  ప్రతీ టీంలో పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. శుక్రవారం నుంచి అక్టోబర్​18 వరకు  కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్జీలో పేర్కొన్న వివరాలను టీమ్ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సాగు చేసుకుంటున్న అటవీ భూమి కొలతలు సేకరించి, విచారణ చేసి వివరాలను వెంటనే యాప్ లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, ఏడీ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డీఎల్పీఓ మల్లికార్జున్, కలెక్టరేట్ పరిపాలన అధికారి గంగయ్య పాల్గొన్నారు. 

స్వరాజ్యంతోనే సమస్యల పరిష్కారం
డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ 

కోనరావుపేట,వెలుగు : స్వరాజ్యంతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కారం అవుతాయని, అణచివేతకు గురవుతున్న వారే అధికారంలోకి రావాలని డీఎస్పీ(దళిత శక్తి ప్రోగ్రాం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా శుక్రవారం కోనరావుపేటలో ఆయన మాట్లాడారు. పేదవర్గాలు ఓట్లను అమ్ముకుని అధికారానికి దూరం కావద్దని అన్నారు. సీఎం కేసీఆర్​కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి పెట్టిన డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాలు మార్చవచ్చన్నారు. అగ్ర కులాల అధికారం బలహీనవర్గాల ప్రజలను అణచివేస్తుందని అన్నారు.తెలంగాణలో రెడ్డి, వెలమల రాజ్యాన్ని కూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాన్ని స్థాపించడమే పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి హరీశ్ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ తదితరులుపాల్గొన్నారు.  

తొవ్వ ఇవ్వలేదని గడ్డపారతో దాడి

వీణవంక, వెలుగు : తమ పొలానికి వెళ్లడం కోసం తొవ్వ  ఇవ్వలేదని గడ్డపారతో దాడి చేసిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నోముల రాంరెడ్డి, కాంతాల కరుణాకర్ రెడ్డి రైతులు. తన పొలంలోకి వెళ్లడానికి బాట ఇవ్వాలని కరుణాకర్​రెడ్డి కొంతకాలంగా రాంరెడ్డిని అడుగుతుండగా రాంరెడ్డి నిరాకరించాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తొవ్వ విషయమై శుక్రవారం మరోసారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కరుణాకర్​రెడ్డి కుటుంబ సభ్యులు రాంరెడ్డిపై గడ్డపారతో దాడి చేయగా రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. రాంరెడ్డి భార్య విజయ  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. రాంరెడ్డిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.


విలీన గ్రామాలను జీపీగా మార్చాలి
గ్రామస్తుల సంతకాల సేకరణ

సిరిసిల్ల టౌన్, వెలుగు : సిరిసిల్ల మున్సిపల్​లో వీలీనం చేసిన తమ గ్రామాలను మళ్లీ గ్రామ పంచాయతీలుగా మార్చాలంటూ విలీన గ్రామాల ఐక్యవేదిక ప్రతినిధులు సంతకాల సేకరణ చేపట్టారు. శుక్రవారం సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ బస్టాండ్ వద్ద విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. పెద్దూర్ పరిధిలోని 8వ, 9వ వార్డు ప్రజలు తమ వార్డులను జీపీలుగా గుర్తించాలని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్​లో విలీనం చేయడంవల్ల ఉపాధి హామీ పని కోల్పోయామని, వందలలో వచ్చే ఇంటి పన్నులు వేలల్లో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు పెద్దూరు పీఏసీఎస్​ వైస్ చైర్మన్ బెజ్జారం నారాయణ, మాజీ చైర్మన్ ఉలిసె తిరుపతి, బాలరాజు, కిషన్ నాయక్, కమలాకర్ రావు, జెట్టి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెలతోనే దేశ అభివృద్ధి
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్

గంగాధర, వెలుగు : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే ఎస్. రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లో రూ.16 లక్షలతో నిర్మించిన జీపీ నూతన భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధురానగర్ చౌరస్తాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం సర్పంచ్ వేముల లావణ్యకు శుభాకాంక్షలు తెలిపి కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్​, జడ్పీటీసీ అనూరాధ-, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గంగాధర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.

గర్భిణులకు హెచ్ బీ పరీక్షలు చేయాలి
కలెక్టర్ కర్ణన్

కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలోని గర్భిణుల వివరాలను ఆన్ లైన్ చేయడంతోపాటు 100శాతం హెచ్ బీ పరీక్షలు నిర్వహించాలని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్ కాన్ఫరెన్స్ హాల్​లో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, అంగన్ వాడీ సూపర్ వైజర్​లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణుల నమోదు తక్కువగా ఉన్న మానకొండూర్, చెల్పూర్, వావిలాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు 100 శాతం వివరాలను నమోదు చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి పోషణ అందించాలని, వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని, ఎ షీల్డ్ యాప్ లో వారి వివరాలను నమోదు చేయాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండ్ రత్నమాలు తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్లు

గోదావరిఖని, వెలుగు : స్థానిక గవర్నమెంట్ జనరల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న డయాలసిస్‌‌‌‌‌‌‌‌ పేషంట్లకు శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు ఇవ్వాలని 2021 మార్చి 14న అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లో  ప్రస్తావనకు తీసుకువచ్చానని, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడానన్నారు. స్పందించిన ప్రభుత్వం డయాలసిస్‌‌‌‌‌‌‌‌ చేసుకునే ప్రతి పేషెంట్‌‌‌‌‌‌‌‌కు ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌ రూ.2,016  మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో మేయర్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌, డిప్యూటి మేయర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌రావు, కార్పొరేటర్‌‌‌‌ బాలరాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, సర్పంచ్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌, సతీశ్, డాక్టర్లు అశోక్‌‌‌‌, రాజు పాల్గొన్నారు. 

11, 12 తేదీలలో జోనల్‌‌‌‌ మైన్స్ రెస్క్యూ పోటీలు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి 51వ జోనల్‌‌‌‌ మైన్స్‌‌‌‌ రెస్క్యూ పోటీలను 11, 12 తేదీలలో ఆర్జీ 2 డివిజన్‌‌‌‌ పరిధి జీడీకే 7 ఎల్‌‌ఈపీ గని, మైన్స్‌‌‌‌ రెస్క్యూ స్టేషన్‌‌‌‌లో నిర్వహించనున్నారు. పలు అంశాలపై నిర్వహించే ఈ పోటీలలో గెలుపొందిన సభ్యులను ఎంపిక చేసి నవంబర్‌‌‌‌లో జరగనున్న ఆల్‌‌‌‌ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీలకు పంపిస్తారు. ఈ సందర్భంగా జీడీకే 7 ఎల్‌‌ఈపీ గనిని ఆర్జీ 2 ఏరియా జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ ఎ.మనోహర్‌‌‌‌ దర్శించి భూగర్భ గనిలో గ్యాలరీలు, పని స్థలాలను పరిశీలించి ఆఫీసర్లకు సూచనలు చేశారు. జీఎం వెంట వకీల్ పల్లి ప్రాజెక్ట్ ఆఫీసర్‌‌‌‌ శ్రీనివాస్ రెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు, గని మేనేజర్లు నీలేశ్​మహేంద్ర, తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్ర శేఖర్, డీవైఎస్ఎస్ఓ అఫ్సర్ పాషా,  సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌ పీవీ.రమణ ఉన్నారు.