పెండ్లి కావట్లేదని కోర్టు అటెండర్ సూసైడ్

గన్నేరువరం, వెలుగు: పెండ్లి కావట్లేదని కరీంనగర్​జిల్లాకు చెందిన ఓ కోర్టు అటెండర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చందా నరసింహరావు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన కొరివి రామచంద్రం(36) ఏడాదిగా కరీంనగర్ ఫ్యామిలీ కోర్టులో అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి పెండ్లి కాలేదు.

కుటుంబ సభ్యులు కొన్ని నెలలుగా సంబంధాలు చూస్తున్నప్పటికీ ఎక్కడా కుదరలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రామచంద్రం రెండు నెలలుగా డ్యూటీకి కూడా వెళ్లడం లేదు.ఇంట్లోనే ఉంటూ.. పదేపదే పెండ్లి గురించి తల్లితో చెప్పి బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్​లో ఉరివేసుకున్నాడు. తల్లి సుగుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.