కరీంనగర్‌ జిల్లాలో సుభాష్​చంద్రబోస్‌‌‌‌‌‌‌‌కు ఘన నివాళి

కరీంనగర్‌ జిల్లాలో సుభాష్​చంద్రబోస్‌‌‌‌‌‌‌‌కు ఘన నివాళి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ/చొప్పదండి/కోరుట్ల/మల్యాల/కోనరావుపేట,  వెలుగు : స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఉమ్మడి జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేతాజీ విగ్రహాలకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు నివాళులర్పించారు. మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీనివాస్ , డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లాకేంద్రంలోని తహసీల్‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వద్ద భారతి సురక్షా సమితి నేతలు సుభాష్ చంద్రబోస్‌‌‌‌‌‌‌‌ విగ్రహానికి నివాళులర్పించారు. కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి లీడర్లు పూలమాలలు వేశారు. చొప్పదండి, కోనరావుపేట, మల్యాల, రాయికల్‌‌‌‌‌‌‌‌ నివాళులర్పించారు.