కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో అర్థరాత్రి రాజీవ్ రహదారిపై బైక్ ను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టి్ంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైకుపై ఉన్న ముగ్గురిలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26) గుర్తించారు. రామంచ గ్రామానికి చెందిన గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26) ఇసుక పనికి వచ్చి తిరిగి రాత్రి ఇంటికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.