కోరుట్ల, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా గురువారం కోరుట్లలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధవేణి మహేశ్, మండల అధ్యక్షుడు పంచరి విజయ్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచరులు మునుగోడు నియోజకవర్గంలోని పుట్టపాక గ్రామంలో డబ్బులు పంచుతూ దొరకడం సిగ్గుచేటని ,ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సయ్య, శ్రీనివాస్ రావు, ధనుంజయ్, వేణు, రాజశేఖర్, మురళి, వెంకటి, కౌన్సిలర్లు నరేశ్, గణేశ్, సర్పంచ్ తుక్కారం పాల్గొన్నారు.
మెట్ పల్లి, వెలుగు: మునుగోడులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పుట్టపాక గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచరులు డబ్బులు పంచుతూ పట్టుబడటం సిగ్గుచేటని ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి జేఎన్ వెంకట్ అన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం పాత బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో లీడర్లు రమేశ్, శ్రీనివాస్, సుఖేందర్ గౌడ్, పుదరి అరుణ, నగేశ్, విజయ్ పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
చొప్పదండి,వెలుగు: రైతులు దళారులకు వడ్లను అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని కొలిమికుంట, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, కోనెరుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు సెంటర్లను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలన్నారు. చివరి గింజ వరకు కొనేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సర్పంచ్ సుజాత, లావణ్య, పెద్ది శంకర్, నాగిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, అనిల్, లీడర్లు పాల్గొన్నారు.
ఓటమి భయంతో టీఆర్ఎస్ నీచ రాజకీయం
మంథని, వెలుగు: ఓటమి భయంతోనే తెరాస నీచమైన రాజకీయం చేస్తోందని మంథని బీజేపీ లీడర్లు విమర్శించారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి ప్రజలని, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీజం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సదాశివ్, కార్యదర్శి సంతోష్, మండల ఇన్చార్జి చిలువేరి సతీశ్, క్రాంతి, శ్రీనివాస్, రమేష్, సత్యం పాల్గొన్నారు.
నిరాశలో అక్రమాలకు తెరలేపిన టీఆర్ఎస్
గొల్లపల్లి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే తన మంత్రులు, ఎమ్మెల్యేలపై రాజీనామా ఒత్తిడి వస్తుందని గ్రహించిన టీఆర్ఎస్ప్రభుత్వం నిరాశ నిస్పృహలకు గురై అక్రమాలకు తెరలేపిందని బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కస్తూరి సత్యం విమర్శించారు. గురువారం గొల్లపల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాన్లోకల్లీడర్లు మునుగోడులోనే మకాం వేసి ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బు, లిక్కర్విచ్చలవిడిగా పంపిణీ చేశారన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు భూమయ్య, గంగారాం, లక్ష్మణ్, లింగారెడ్డి, రాఘవరెడ్డి,రాజేందర్ పాల్గొన్నారు.
ఈటల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
వీణవంక, వెలుగు: వీణవంక మండలంలో బీజేపీ లీడర్లు నల్లజెండాలతో నిరసన చేపట్టారు. బండి సంజయ్అరెస్ట్కు నిరసనగా సీఎం కేసీఆర్దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి కటౌట్ కు బీజేపీ లీడర్లు క్షీరాభిషేకం చేశారు.
రైతు లేకపోతే తిండి లేదు
కరీంనగర్ టౌన్,వెలుగు: రైతు లేనిది తిండి లేదని, అలాంటి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని జాగరణ్‍వికాస్ జాతీయ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణమండపంలో మూడ్రోజుల పాటు నిర్వహించే కిసాన్ గ్రామీణమేళాను ఎంఎస్పీ సభ్యుడు, పంజాబ్ రైతు సంఘం నాయకుడు భూపేంద్రసింగ్ మాన్ తో కలిసి సుగుణాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతుల హక్కుల సాధనకు, అభ్యున్నతి కోసం సంఘటిత పోరాటాలు అవసరముందన్నారు. కిసాన్ మేళాలతో రైతుల ఐక్యతను చాటాల్సిన టైం వచ్చిందన్నారు. అనంతరం సుగుణాకర్ రావు మాట్లాడుతూ....హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నిర్వహించే మేళాలకు గ్రామాల నుంచి రైతులు హాజరుకాలేరని, అందుకే కరీంనగర్ లో గ్రామీణ కిసాన్ మేళాను ఏర్పాటు చేశామని చెప్పారు. 3,4,5 తేదీల్లో నిర్వహించే మేళాలో రైతులు, చేతివృత్తిదారులు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల జాతీయ నాయకులు పునీత్ ప్రకాశ్, గురువంత్ పాటిల్, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు, శాస్త్రవేత్తలు,అధికారులు పాల్గొన్నారు.
గన్ లైసెన్స్‌పై అసత్య ప్రచారం సరికాదు : సీపీ సత్యనారాయణ
వీణవంక, ఇల్లందకుంట, వెలుగు: గన్లైసెన్స్ల జారీపై అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని సీపీ సత్యనారాయణ సూచించారు. గురువారం వీణవంక, ఇల్లందకుంట పోలీస్స్టేషన్లను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నుంచి గన్‌లైసెన్స్ కోసం రెండు అప్లికేషన్లు వచ్చాయని, ఎంక్వైరీ చేసి ఒక్కరికే లైసెన్స్ ఇచ్చామన్నారు. గన్లైసెన్స్ల విషయంలో అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇన్చార్జి సీఐ రామచందర్ రావు, ఎస్సై శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
భారతజాతిని ఏకం చేసేందుకే జోడో యాత్ర : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, వెలుగు: భారతజాతిని ఏకం చేసేందుకే రాహుల్ జోడో యాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల ఇందిరా భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఉద్యోగ కల్పనను విస్మరించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, విభజించి, పాలించే కుట్రను నిలువరించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుతో ప్రజాస్వామ్యం అపహస్యం పాలవుతుందని విమర్శించారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేక టిఆర్ఎస్, బీజేపీలు ఎమ్మెల్యేల కొనుగోలు పర్వానికి తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, మన్సూర్, రమేశ్‌బాబు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి
కొడిమ్యాల,వెలుగు: రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ గల్ఫ్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడిమ్యాల మండలం సూరంపేట విలేజ్ కి చెందిన అక్కినపల్లి రాయమల్లు దుబాయ్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా అతని కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, చిలువేరి నారాయణ, నాగ భూషణ్ రెడ్డి, జీవన్ రెడ్డి
పాల్గొన్నారు.
పాత వారికి మళ్లీ పదవీ ఇస్తే రాజీనామాకు సిద్ధం
చొప్పదండి,వెలుగు: పదవులు అనుభవించిన వారికి మళ్లీ ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేసి ఇప్పటికీ పదవులు పొందని కార్యకర్తలకు ఇవ్వాలని చొప్పదండి మండలానికి చెందిన ఆ పార్టీ లీడర్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. లీడర్లు మచ్చ రమేశ్, వెంకటరమణ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి మాట్లాడుతూ చొప్పదండి ఏఎంసీ చైర్మన్‌పదవిని కొత్తవారికి కేటాయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నా.. పట్టించుకోకుండా పాతవారికే పదవి వచ్చేలా ప్రపోజల్ పంపించారని ఆరోపించారు. ఆ ప్రపోజల్ తక్షణమే ఆపాలని, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని
వినోద్ కుమార్‌కు చెప్పారు.
సమస్యలు పరిష్కరించినంకనే గనిని మూసేయండి
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ 2 డివిజన్‌లో గల జీడీకే 7 ఎల్‌ఈపీ గని మూసివేతపై పొల్యూషన్కంట్రోల్బోర్డు గురువారం పబ్లిక్హియరింగ్నిర్వహించింది. పెద్దపల్లి అడిషనల్కలెక్టర్లక్ష్మినారాయణ, పీసీబీ ఈఈ బి.భిక్షపతి లీడర్లు, స్థానిక ప్రజల అభిప్రాయాలను రికార్డు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బీఎంఎస్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, యూనియన్ల లీడర్లు మొగిలి, రాజరత్నం, జేవీ రాజు, దామోదర్, భాస్కర్, శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రావు.. తదితరులు మాట్లాడుతూ సమస్యలన్నీ పరిష్కరించాకే మైన్ మూసివేతకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. జీడీకే 7 ఎల్ఈపీ గనిలో ఇంకా బొగ్గు నిల్వలున్నాయని, వాటిని తొలగించకుండా మూసివేయడం తగదన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్.. అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో 19 మంది అభిప్రాయాలను తెలపగా, 15 మంది వినతిపత్రాలను ఆఫీసర్లకు అందజేశారు. పబ్లిక్ హియరింగ్ ఉందన్న సమాచారం తెలపకపోవడంతో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌లు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యక్రమ స్థలం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
పాత వారికి మళ్లీ పదవీ ఇస్తే రాజీనామాకు సిద్ధం
చొప్పదండి,వెలుగు: పదవులు అనుభవించిన వారికి మళ్లీ ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేసి ఇప్పటికీ పదవులు పొందని కార్యకర్తలకు ఇవ్వాలని చొప్పదండి మండలానికి చెందిన ఆ పార్టీ లీడర్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. లీడర్లు మచ్చ రమేశ్, వెంకటరమణ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి మాట్లాడుతూ చొప్పదండి ఏఎంసీ చైర్మన్‌పదవిని కొత్తవారికి కేటాయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నా.. పట్టించుకోకుండా పాతవారికే పదవి వచ్చేలా ప్రపోజల్ పంపించారని ఆరోపించారు. ఆ ప్రపోజల్ తక్షణమే ఆపాలని, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వినోద్ కుమార్‌కు చెప్పారు.