కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని శివాలయంలో ఓ మహిళ ఆదివారం(సెప్టెంబర్ 01) హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, భీంపల్లి గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల అనే మహిళ తన తండ్రి ఇజ్జిగిరి కొమురయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో గత మూడు రోజుల క్రితం అర్కండ్ల గ్రామానికి వచ్చింది. ప్రమీల ఆదివారం ఉదయం అర్కండ్ల నుండి తన తండ్రి కొమురయ్యను తీసుకొని మొలంగూర్ కు బయలదేరింది.
అయితే ప్రమీల ఆ సమయంలోనే హత్యకు గురైందని స్థానికులు తెలిపారు. ప్రమీల మెడలో ఉన్న బంగారు నగల కోసమే ఆటో డ్రైవర్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.