తెలంగాణలో 90 సీట్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ఎంపీ వినోద్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో అన్నీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తు్ందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం అనేది జరగదన్నారు వినోద్. లేనిది ఉన్నట్టు చూపించే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, గాలి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆగం కావద్దని అన్నారు వినోద్. మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ట్రయాంగిల్ ఫైట్ ఉందన్న వినోద్ .. ఖమ్మంలో మాత్రం రెండు మూడు చోట్ల ఓడిపోతామని చెప్పారు.
బీజేపీ పార్టీ మత విద్వేషాలు పెంచుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వినోద్ తెలిపారు.