కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీ .. 40 కేజీల బస్తాపై 2 నుంచి 3 కేజీల అదనపు తూకం

కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీ .. 40 కేజీల బస్తాపై 2 నుంచి 3 కేజీల అదనపు తూకం
  • సర్కార్ చెప్పినా మారని కొనుగోలు సెంటర్ల నిర్వాహకుల తీరు

కరీంనగర్, వెలుగు: ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఓ వైపు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా కొందరు వడ్ల కొనగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రం మారడం లేదు. తరుగు పేరిట అదనంగా వడ్లు తూకం వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిలర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కయ్యే ఈ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

గత సర్కార్ హయాంలో వడ్ల కొనుగోలు సెంటర్లలో తాలు, తరుగు పేరిట 40 కేజీల బస్తాపై అదనంగా 3 కేజీల నుంచి 5 కేజీల వరకు తూకం వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. అయితే కొందరు వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. దీంతో తాము క్వింటాపై 6 కేజీల నుంచి 10 కేజీల వరకు నష్టపోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మట్టి, తాలు పేరిట అదనపు తూకం

ప్రస్తుతం వడ్ల కొనుగోలు సెంటర్లలో 40 కేజీల బస్తాలో బస్తా బరువుతో కలిపి 40 కేజీల 600 గ్రాములు తూకం వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 600 గ్రాములను తరుగుగా తీసేస్తున్నారు. బస్తా బరువు కంటే ఎక్కువగా తూకం వేయొద్దనే ఆదేశాలు ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పట్టించుకోవడంలేదు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల దగ్గర క్వింటాకు 5 కేజీల వడ్లను అదనంగా తూకం వేస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని పలు సెంటర్లలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. 

శంకరపట్నం మండలంలో చాలా చోట్ల 40 కేజీల బస్తాలో 43 కిలోలు తూకం వేస్తుండగా, జమ్మికుంట,  ఇల్లందకుంట మండల కేంద్రాల్లో 42 కేజీలు కాంటా వేస్తున్నారు. కొందరు రైతులు వడ్లను రైస్ మిల్లులకు తరలించాక ఏదో ఒక వంకతో మిల్లర్లు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. కొందరు 2 క్వింటాళ్ల వడ్లను తరుగుగా ఇస్తేనే వడ్లను దిగుమతి చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయమై మానకొండూరు సివిల్ సప్లై డీటీ సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా రైతు ఇష్టానుసారమే క్వింటాకు 5 కేజీల వడ్లను ఎక్కువగా ఇచ్చాడని చెప్పడం గమనార్హం. 

క్వింటాకు 5 కేజీలు కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరు 

జగ్గయ్యపల్లి–శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ గ్రామాల మధ్య కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన్రు. సెంటర్​ప్రారంభించిన రోజు తూకం బస్తా బరువు కన్నా ఎక్కువ పెట్టొద్దని చెప్పిన్రు.. కానీ ఈ సెంటర్లో మాత్రం క్వింటాకు 5 కిలోలు ఎక్కువ తూకం వేసిన్రు.. అయినా కూడా మంగళవారం కాంటాలు పెట్టి తీసుకెళ్లిన 3 ట్రాక్టర్లను రైస్ మిల్లు ఓనర్ దిగుమతి చేసుకోనని చెప్పిండు. ఈ విషయం సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జికి చెప్పి ఆయనను మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరికి తీసుకెళ్లగా.. ఒక్కో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 80 కిలోల వడ్లు ఇచ్చినంకనే దిగుమతి చేసుకున్నరు. అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి. 

ఆవుల రాజయ్య, జగ్గయ్యపల్లి, మానకొండూర్ మండలం

ఇటీవల మానకొండూర్ మండలంలోని ఓ కొనుగోలు కేంద్రం రైతు వడ్లు తూకం వేసి రైస్ మిల్లుకు తీసుకెళ్లాడు. ఆ మిల్లర్ ఆ వడ్లను దిగుమతి చేసుకోవాలంటే 2 క్వింటాళ్ల వడ్లు ఎక్కువగా ఇవ్వాలన్నాడు. అలాగే ట్రాక్టర్, హమాలీ ఖర్చులు మొత్తం రైతే భరించాలని, అలా అయితేనే తీసుకుంటానని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక రైతు ఎక్కువ వడ్లను ఇవ్వడానికి ఒప్పుకొని మిల్లులో ధాన్యం అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించాడు.