కరీంనగర్లో పట్టపగలే భారీ చోరీ

కరీంనగర్లో పట్టపగలే భారీ చోరీ
  • 15 లక్షలు తీసుకెళ్తున్న వ్యక్తిని వెంటాడి చోరీ

కరీంనగర్ నగరంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది.  కలెక్టరేట్  ఎస్.బి.ఐ బ్యాంకు నుంచి 15 లక్షలు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తిని వెంబడించిన దుండగులు అదనుచూసి నగదు దోచుకెళ్లారు. గీతా భవన్ చౌరస్తాలో చోరీ ఘటన చోటు చేసుకుంది. రెడ్ మిక్స్ ప్లాంట్ ఓనర్ రామగిరి చంద్రప్రకాశ్ తన దగ్గర పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తుండగా చోరీ జరిగింది.

హఠాత్తుగా దుండగులొచ్చి చేతిలోని డబ్బులు తీసుకుని పారిపోతుంటే షాక్ కు గురై కేకలు వేసినా ప్రయోజనం లేకపోయిందని బాధితుడు చంద్ర ప్రకాశ్ వాపోయాడు. వెంటనే టూ టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు  చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసిన దొంగల కోసం గాలింపు చేపట్టారు.