ప్రేమ పేరుతో ఓ యువకుడు వంచించి మోసం చేయడంతో యువతి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత యువతి అఖిల రాసిన వాట్సాప్ పోస్ట్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల.. ఇన్స్టాగ్రాంలో పరిచయమైన భరత్ అనే యువకుడిని ప్రేమించి సర్వం అర్పించింది. తీరా ఏమైందో ఏమో గాని.. ఆమె ఇంట్లో ఉరివేసుకుని నిండు ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు సెల్ ఫోన్లో తన ప్రియుడైన భరత్ తల్లిదండ్రులనుద్దేశించి అఖిల పంపిన వాట్సాప్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గుండెను కదిలించే పదాలతో.. అఖిల రాసిన లేఖ సారాంశం.. ఇదే..
“నేను చాలా సెన్సిటివ్.. నేను ఓవర్ లవ్.. ఓవర్ కేర్.. ఓవర్ పొసెసివ్. ఓవర్ థింక్ చాలా చేస్తా అని నేను డే వన్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా! పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఫిజికల్గా వాడుకున్నాడు నన్ను. నా చావుకి కారణం అమగోత్ భరత్. మీకు చెప్పినా కూడా కొంచెం కూడా ఏం లేకుండా మీరు అందరూ కలిసి నా బతుకు ఆగం చేశారు. నా చావుకు కారణం అయినారు. నా ఇంట్లో ఎప్పటికీ తీరలేని బాధ మిగిల్చారు. మీకు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. మీకు తెలుస్తుంది నేను పడిన బాధ. మీవల్ల మా వాళ్లు పడిన బాధ. మొత్తం మీరు కూడా అనుభవిస్తారు ఒకరోజు. పేరెంట్స్ మీరే పట్టించుకోకపోతే అలా గాలికి వదిలేస్తే నాలాంటి వాళ్లు ఇలా చావాల్సి వస్తుంది. ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు. ఎంత వేస్ట్ గాడు అయినా కూడా పోనీ పోనీ అనుకొని ఫర్గివ్ చేసా! లాస్ట్కి నన్నే “చావు.. ఏం కాదు మాకు” అని మాట్లాడిండు నీ కొడుకు. నాతో తిరిగింది, నాతో తిన్నది నాతో చేసినవి అన్నీ కళ్ళకి కనిపియ్యకుండా పోయినాయి. పెంచడం చేతకాకపోతే కనొద్దు ఇలాంటి కొడుకును. ఉత్తగా మీ వల్ల బంగారం లాంటి నా ఫ్యామిలీలో రిమార్క్ పడిపోయింది. మీ ఇంట్లో కూడా ఏ తప్పు చేయకుండా ఒకరు నాలాగా చచ్చిపోతే తెలుస్తుంది మీకు. ఇలాంటి పాపపోనికి పోనీలే అని వందల ఛాన్స్లు ఇచ్చాను. లవ్ చేసిన కదా అని వెనుక వేసుకుని వస్తే నా చావుకే కారణం అయినాడు లాస్ట్కి. సిగ్గు లేకుండా ఇట్లా బ్రతుకుతారో నా ప్రాణం తిని ఛీ...!”