కరీంనగర్ కు జాతీయస్థాయి అమృత్ సిటీ అవార్డు

  • మార్చి 5న అందజేయనున్న రాష్ట్రపతి   

కరీంనగర్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన జాతీయస్థాయి  అవార్డుల్లో కరీంనగర్  కు  అమృత్ సిటీ  అవార్డు  దక్కింది.  మార్చి 5న ఢిల్లీలోని  విజ్ఞాన్  భవన్  లో  రాష్ట్రపతి  ద్రౌపది  ముర్ము    అవార్డులను పంపిణీ చేయనున్నారు. 4నెలల క్రితం కేంద్రప్రభుత్వ ప్రతినిధులు కరీంనగర్  లో  10రోజుల  పాటు  సర్వే చేసి అమృత్ సిటీగా ఎంపిక  చేశారు.

 సిటీలో వాటర్ సప్లై, జంక్షన్ల అభివృద్ది, మీడియన్ల మెయింటెనెన్స్,  డెయిలీ వాటర్ సరఫరా, సానిటరీ, డ్రైనేజీ,  పబ్లిక్ టాయిలెట్స్ తదితర అంశాలపై  కమిటీ ప్రత్యేకంగా సర్వే  చేసింది.    కరీంనగర్ నగరప్రజలు, అధికారులు,సిబ్బంది,పాలకవర్గ  సహకారంతో అవార్డులను  గెలుచుకుంటున్నం. త్వరలో సిటీలో 24/7 నీటిసరఫరా చేస్తామని, దేశంలోనే మొదటి నగరంగా  పేరు తెస్తామని మేయర్​ యాదగిరి సునీల్ రావుతెలిపారు.