
కరీంనగర్ టౌన్, వెలుగు: గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ, ఫిజిషియన్స్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో సిటీలోని ఐఎంఏ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు పౌష్టిహారం తీసుకుంటూ డాక్టర్ల సూచనల మేరకు ఎక్సర్ సైజులు చేయాలన్నారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఉమెన్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డా.జీబీ మాధవి, జి.రాంమోహన్, ఫిజీషియన్ డాక్టర్స్ ప్రెసిడెంట్ డా.విజయమోహన్ రెడ్డి, ఉషా ఖండేల్, వెంకటేశ్వర్లు, రఘురాం, శ్రీలత, నవీన్ కుమార్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.