
జగిత్యాల టౌన్లో దారుణం జరిగింది. సార్గమ్మ సందిలో అప్పుల గొడవలో తిప్పర్తి కిషన్ పై గొడ్డలితో కత్రోజ్ లక్ష్మణ్ అనే వ్యక్తి దాడి చేశాడు. బండ్లో గొడ్డలి పెట్టుకొని వచ్చిన లక్ష్మణ్… నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కిషన్ పై దాడి చేశాడు. గాయపడిన కిషన్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు పక్కన ఉన్న షాపులోని సీసీ కెమెరాల్లో దాడి విజువల్స్ రికార్డయ్యాయి.