బండి సంజయ్ ఏ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరు : కరీంనగర్ మేయర్ సునీల్ రావు 

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. బీజేపీ బలహీనమైన పార్టీ అని బండి సంజయ్ ఒప్పుకున్నారంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రావాలని బండి సంజయ్ ఆహ్వానిస్తున్నారంటే.. ఆ పార్టీ నాయకులు ఎందుకు పనికి రారని నిరూపితమైందని అన్నారు. బీజేపీకి ఇతర పార్టీ నేతలే దిక్కు అంటూ మాట్లాడారు. కరీంనగర్ కు ఎంపీగా ఉన్న బండి సంజయ్.. నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

బండి సంజయ్ మోకాలి యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని మేయర్ సునీల్ రావు చెప్పారు. నిరుద్యోగులను బీజేపీ మోసగించిందని, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుతోందన్నారు. రాష్ట్ర పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.