అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి లోటు లేదని చెప్పారు. కొన్ని పార్టీలో కొన్ని విధానాలు తనకు నచ్చలేదన్నారు. స్మార్ట్ సిటీ నిధుల కేటాయింపులో బండి సంజయ్ సహకరించారని తెలిపారు. తాను ఎవరి పై విమర్శలు చేయబోనని..ఎవరైనా తనపై విమర్శలు చేస్తే ఊరుకోనన్నారు. బీఆర్ఎస్ లో జరిగిన అనేక పరిణామాలకు తాను మౌనసాక్షిని అని చెప్పారు.
పార్టీ వీడవద్దంటూ పలువురు బీఆర్ఎస్ నుంచి ఫోన్లు చేశారని తెలిపారు సునీల్ రావు. కానీ కరీంనగర్ నగర అభివృద్ధి నా రాజకీయ భవిష్యత్తు కోసమతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తనకెప్పటికీ శ్రేయోభిలాషి ఆయనకు రుణపడి ఉంటానన్నారు.
బీఆర్ఎస్ ను వీడిని కరీంనగర్ మేయర సునీల్ రావు తన అనుచరులతో కలిసి జనవరి 25న మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.