![గెలిపిస్తే నిజాయితీగా పని చేస్తా : ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/karimnagar-mlc-candidate-ashok-kumar-promises-honest-work-for-education-sector_RrC8wSTO0b.jpg)
- కరీంనగర్ టీచర్
నస్పూర్/మంచిర్యాల, వెలుగు : విద్యారంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని, గెలిపిస్తే నిజాయితీగా పని చేస్తానని కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల, నస్పూర్‌లలో ప్రచారం నిర్వహించిన అనంతరం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేయించి ఓపీఎస్ పునరుద్ధరణ చేయిస్తామని, 317 జీఓ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇప్పిస్తానన్నారు. పెండింగ్ బకాయిలు, పెన్షన్, పీఆర్సీ, ప్రమోషన్ వంటివి ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కొందరు వక్రమర్గాలతో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూసేవారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.శాంతకుమారి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ. భుజంగారావు, టీఎస్ఎస్ సీఎస్ టీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రాజనర్సు బాపు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రాజావేణు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, టీఎఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వి. కిరణ్ కుమార్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కిరణ్, టీఏఎస్యూటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం. ఆగచారి తదితరులు పాల్గొన్నారు.