గవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు : బండి సంజయ్

కరీంనగర్ :  తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైలు పంపినా గుడ్డిగా ముద్ర వేస్తే గవర్నర్ మంచివారు అని అంటారని అన్నారు. గవర్నర్ తమ విచక్షణ అధికారాలు ఉపయోగించి తప్పులు తప్పు అంటే ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తున్నారని చెప్పారు. గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై మంత్రులతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాజ్యాంగ పదవిలో ఉన్న తమిళిసై తీరు సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా గతంలో కేబినెట్ కోరింది. ఆ సిఫార్సులను గవర్నర్ తమిళిసై రిజెక్ట్ చేశారు.  ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని స్పష్టం చేశారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా గతంలో కేబినెట్ కోరింది. ఆ సిఫార్సులను గవర్నర్ తమిళిసై రిజెక్ట్ చేశారు.