కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ

కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ 13వ తేదీ ఉదయం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భద్రత కారణాలతో సాదాసీదాగా ఈ వేడుక జరిగింది. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కు సహచర మంత్రి నిత్యానంద రాయ్ అభినందనలు తెలిపారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ స్వయంగా హాజరయ్యి ఆశీర్వదించారు. హైదరాబాద్, కరీంనగర్ నుంచి వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలను ప్రజల కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తానన్నారు బండి సంజయ్.