
కరీంనగర్ టౌన్, వెలుగు: ఆస్తిపన్నులు సకాలంలో చెల్లించి సిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ నగర ప్రజలను కోరారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వెంకటసాయి థియేటర్, లిటిల్ పార్కు, ఓ లేడీస్ ఎంపోరియం తదితర ఆస్తులను సోమవారం మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సీజ్ చేసినట్లు కమిషనర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులు చెల్లించాలని, లేకపోతే నోటీసులు జారీ చేసి సంబంధిత ఆస్తులను సీజ్ చేసి మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం, తదితరులు పాల్గొన్నారు.