కరీంనగర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కార్పోరేటర్ కోల భాగ్యలక్ష్మి రాజీనామా

కరీంనగర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ కార్పోరేషన్ 17వ డివిజన్ కార్పోరేటర్ కోల భాగ్యలక్ష్మి డిసెంబర్ 6వ తేదీ బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు పంపించారు.

బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తరువాత 2009 నుండి నేటి వరకు మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు.. తనను మీ కుటుంబంలో  ఒక్కరిగా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.   గత 10సంవత్సరాల నుండి తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ మీ మీద గౌరవంతో ఒక కార్యకర్తగా  పార్టీలో కొనసాగుతూ వచ్చానని చెప్పారు. కానీ, పార్టీ అధినేత ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యులకు సైతం సరిగా అందకపోవడం వలన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని... ఇప్పుటి వరకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.