దూరం నుంచి చూస్తే కొండల్లా కనిస్తున్నా... నిజానికివి ‘చెత్త’ గుట్టలు. కరీంనగర్ సిటీ శివారులో బైపాస్ రోడ్డు పక్కన డంపింగ్ యార్డు పరిస్థితి ఇది.. ఈ డంపింగ్ యార్డుకు రోజూ పట్టణం నుంచి 200 క్వింటాళ్ల చెత్త చేరుకుంటుంది. చెత్తను బయోమైనింగ్ చేసేందుకు ఒక కంపెనీ రూ.16.50 కోట్లకు ఒప్పదం కుదుర్చుకుంది. ఒక మెషీన్ కూడా తీసుకువచ్చారు.
అది కొన్ని రోజులు మాత్రమే నడిచి రిపేర్ లో పడింది. దీంతో చెత్త మొత్తం గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వర్షకాలంలో దుర్వాసన, ఎండకాలంలో పొగ సిటీలోకి వస్తోంది. దీంతో కరీంనగర్ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెత్త రీసైక్లింగ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వెలుగు, ఫొటో గ్రాఫర్ కరీంనగర్