కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో చోరీల నియంత్రణకు అవుట్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుందన్నారు. అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లో 24 గంటల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని  తెలిపారు. 

కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, వన్ టౌన్ సీఐ కోటేశ్వర్, ఎస్సై రాజన్న, ఆర్టీసీ అధికారులు ఎస్‌‌‌‌‌‌‌‌.భూపతి రెడ్డి, డీఎం విజయ మాధురి, శ్రీనివాస్ పాల్గొన్నారు.