కరీంనగర్ పబ్లిక్ పండగ చేస్కోండి.. రైల్వే స్టేషన్ రూపురేఖలే మారినయిగా..!

కరీంనగర్ పబ్లిక్ పండగ చేస్కోండి.. రైల్వే స్టేషన్ రూపురేఖలే మారినయిగా..!
  • కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లకు కొత్త రూపు
  • అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో మారిన రూపు రేఖలు
  • లిఫ్టులు, ఎస్కలేటర్లలాంటి మెరుగైన సౌకర్యాలు
  • ఎలివేషన్లతో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహా గ్రాండ్​ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(ఏబీఎస్ఎస్) నిధులతో చేపట్టిన పనులతో ఆ స్టేషన్ల రూపు రేఖలే మారిపోయాయి. ఆకట్టుకునే ఎలివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎయిర్ పోర్ట్ తరహా గ్రాండ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంతరించుకున్నాయి. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. రెండేళ్ల కింద కరీంనగర్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.26.64కోట్లతో, రామగుండం రైల్వే స్టేషన్ లో రూ.26.49 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులు పూర్తయ్యాక త్వరలోనే వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు..
కరీంనగర్, రామగుండం రైల్వే స్టేషన్లను పూర్తిగా అప్ గ్రేడ్ చేశారు. ఒక ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మరోదానికి వెళ్లేందుకు ప్రయాణికులకు మెట్లు ఎక్కే బాధ తప్పించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన  ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మోడ్రన్ టాయిలెట్లు,  లైటింగ్, టికెట్ కౌంటర్లు, లాకర్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డ్రింకింగ్ వాటర్, ఏటీఎంలు, డిజిటల్ డిస్ ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేగాక రైల్వే స్టేషన్ లోపల సౌలతులతోపాటు బయట కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదపరిచేలా లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మొక్కలతో అభివృద్ధి చేశారు.

వాహనదారులకు నీడతో కూడిన విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డును డివైడర్ తో కూడిన డబుల్ రోడ్డుగా డెవలప్ చేశారు.  అమృత్ భారత్ స్కీమ్ సెకండ్ ఫేజ్ లో పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఎంపిక కాగా, అభివృద్ధి పనుల కోసం నిరుడు ఫిబ్రవరిలో రూ.26.49 కోట్లు మంజూరు చేశారు. రెండు నెలల క్రితమే పాత స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూల్చివేశారు. ఈ స్టేషన్ ఆధునీకరణ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశముంది.