గుండెపోటుతో కరీంనగర్ ఏఎస్ఐ కిషన్ మృతి

గుండెపోట్లు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి.  ఉన్నచోటనే కుప్పకూలిపోతున్నారు. 
ఇవాళ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కిషన్ గుండెపోటుతో  మృతి చెందాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

మార్చి 18న కరీంనగర్ లోని   తీగలగుంటపల్లికి చెందిన  రావుల విజయ్ అనే యువకుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు. భరాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. మార్చి 2న  జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా ప‌నిచేస్తున్న రాజేంద‌ర్  గుండెపోటుతో మృతి చెందారు.