ఇంటర్‌‌‌‌లో గర్ల్స్​ టాప్

వెలుగు, నెట్​వర్క్: మంగళవారం ప్రకటించిన ఇంటర్​ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ ప్రభుత్వ జూనియర్​కాలేజీలు, గురుకుల, మోడల్​ స్కూల్ ​విద్యార్థులు సత్తాచాటారు. మెట్​పల్లికి చెందిన ఎల్ది అనూష ఎంపీసీలో 467, బైపీసీలో బింగిసారం విజేత 992 మార్కులు సాధించారు. జగిత్యాలకు చెందిన తాటిపెల్లి హాసినీ ఎంపీసీ సెకండియర్​లో స్టేట్​ ర్యాంకు, ముసిపట్ల శ్రీనిధి బైపీసీలో స్టేట్​ ర్యాంకు సాధించారు. 

కరీంనగర్ జిల్లాలో.. 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటర్ ​ఫలితాల్లో కరీంనగర్​ విద్యార్థులు సత్తాచాటారు. ఫస్ట్ ​ఇయర్‌‌‌‌లో 69 శాతం, సెకండియర్‌‌‌‌లో 70 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. ఫస్ట్ ​ఇయర్‌‌‌‌లో మొత్తం 14,217 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9934 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాయ్స్ 7471మందికి  4784 మంది, గర్ల్స్ 6746 మందికి 5150 మంది పాస్​అయ్యారు. సెకండియర్‌‌‌‌లో మొత్తం 12,292 మంది విద్యార్థులకు 8677 మంది పాస్​అయ్యారు. వీరిలో బాయ్స్​6106 మందికి, 4005 మంది, గర్ల్స్​6186 మందికి 7672మంది ఉత్తీర్ణత సాధించారు. 2021–22లో సెకండ్ ఇయర్‌‌‌‌లో 72శాతం పాస్ కాగా, ఈసారి 2 శాతం తగ్గి 70శాతానికి పరిమితమైంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో  69శాతం వచ్చింది. 

జగిత్యాల జిల్లాలో.. 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఇంటర్ రిజల్ట్ లో గర్ల్స్ టాప్ గా నిలిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 68 శాతం మంది, ఫస్ట్ ఇయర్ లో 58 శాతం పాస్ అయినట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ మనోహర్ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 6049 మంది విద్యార్థులు హాజరుకాగా 2937 మంది పాస్​అయ్యారు. ఇందులో 2,643 మంది బాయ్స్‌‌కు 1179 మంది, 3,586 మంది గర్ల్స్‌‌కి 2445 మంది పాస్​అయ్యారు. సెకండ్ ఇయర్ లో 6,734 విద్యార్థులకు 4,606 మంది పాస్ ​అయ్యారు. వీరిలో బాయ్స్ 3048 మందికి1758 మంది, గర్ల్స్‌‌ 3,686 మందికి2848 మంది పాస్ అయ్యారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో ఇంటర్‌‌‌‌లో బాలికలే టాప్‌‌గా నిలిచారు. ఫస్టియర్ లో 3981 మంది పరీక్ష రాయగా, 2,283 మంది పాస్ అయ్యారు. వారిలో బాలురు 1,581 మందికి 687 మంది, బాలికలు 2,360 మందికి 1596 మంది, సెకండియర్ లో మొత్తం 3,922 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,688 మంది పాస్​అయ్యారు. బాలురు 1619 మందికి 909 మంది, బాలికలు 2,303 మందికి 1,779 మంది ఉత్తీర్ణత సాధించారు. 

పెద్దపల్లి జిల్లాలో.. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్​ ఇయర్​లో 46.10 శాతం, సెకండియర్​ ఫలితాల్లో 59.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మహాత్మా జ్యోతిబాపులే జూనియర్​ కాలేజీ నుంచి ఫస్ట్​ ఇయర్​ విద్యార్థి కె.సతీశ్​ఎంపీసీలో 459 మార్కులు, సెకండియర్​ విద్యార్థి ఆర్.ఏడుకొండలు(ఎంపీసీ) 984 మార్కులు సాధించారు. మొత్తంగా పెద్దపల్లి జిల్లాలోనూ ఇంటర్​ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.