- తలుపులు పగలగొట్టి ఫైళ్లు ఎత్తుకుపోయిన వ్యక్తి
కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..రెండు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఉదయం వాచ్ మెన్ మసూద్ ఆఫీసుకు రాగా, తాళం పగలగొట్టి ఉంది. వెంటనే సీనియర్అసిస్టెట్ తాజొద్దీన్‌కు చెప్పగా వచ్చాడు. ఇద్దరూ కలిసి లోపలకు వెళ్లి చూడగా రికార్డు గది తలుపులు కూడా పగలగొట్టి ఉన్నాయి.
పరిశీలించగా కొన్ని దస్తావేజులు కనిపించలేదు. ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి సీసీ పుటేజీలను పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి రికార్డు రూంలో నుంచి ఫైళ్లను బయటకు తీయడం కనిపించింది. దీంతో క్లూస్‌టీం బృందాలను రంగంలోకి దించారు. ఘటనపై అధికారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.