
- టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ..బాండ్ పేపర్ ప్రచారం
మెదక్, వెలుగు: కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే ఏం చేస్తాననే హామీలను బాండ్ పేపర్ రాసి టీచర్స్ కు అందిస్తున్నాడు. మెదక్ జిల్లా టేక్మాల్ కు చెందిన ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందితే మహిళా టీచర్లకు ఆరు నెలలలోపు ఫ్రీగా ఎలక్ట్రిక్ బైక్ లు అందజేస్తానని, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతూ బాండ్ పేపర్లు పంపిణీ చేస్తున్నాడు. నియోజకవర్గ పరిధిలోని టీచర్లందరికీ బాండ్ పేపర్లు పంపిస్తున్నట్టు అభ్యర్థి సుధాకర్ రెడ్డి చెప్పారు.