కరీంనగర్ టౌన్,వెలుగు : 46వ తెలంగాణ స్టేట్ లెవెల్ జూనియర్ బాయ్స్ హ్యాండ్ బాల్ పోటీల్లో కరీంనగర్ జట్టు కైవసం చేసుకుంది. . ఈనెల 18 నుంచి 20 వరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హ్యాండ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. సోమవారం జరిగిన ఫైనల్ పోటీలో వరంగల్ జట్టుపై కరీంనగర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాస్, డీఆర్‌వో పవన్ కుమార్, బీసీడబ్ల్యూవో అనిల్ కుమార్, ఎస్జీఎఫ్ఐ వేణుమాధవ్, తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ప్రభాకర్, ఇంద్రసేన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, వెలుగు : రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో 9వ తరగతి బొల్లబత్తిని స్టూడెంట్ అక్షిత్ స్టేట్ లెవల్ హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తాచాటాడు. కరీంనగర్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన అక్షిత్ మెరుగైన ఆటతీరుతో జట్టు విజయానికి కృషి చేశాడు. అక్షిత్ను కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, పీఈటీ సాయికృష్ణ, టీచర్లు అభినందించారు.